|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 02:43 PM
కొండాపూర్ మండలం మందాపూర్ శివారులోని శనీశ్వర ఆలయంలో శని అమావాస్య వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఉదయం నుంచే శనీశ్వరునికి తైలాభిషేకాలు చేశారు. మండలంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి, శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.