|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 02:42 PM
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఒకదానికొకటి నాలుగు వాహనాలు ఢీకొన్నాయి. సుమిత్రానగర్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద ఓ కారు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న రెండు కార్లు, రెండు టెంపో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టెంపో వాహనంలో ఉన్న డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన కారణంగా కూకట్‌పల్లి జాతీయ రహదారిపై సుమారు మూడు కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు నిలిచిపోయాయి.