|
|
by Suryaa Desk | Fri, Aug 01, 2025, 11:59 AM
స్టేట్ డాటా సెంటర్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా జలమండలి ఆన్లైన్ సేవలలో అంతరాయం ఏర్పడటంతో, తాజా పరిస్థితులపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, డైరెక్టర్ లు, ఉన్నతాధికారులతో జూమ్ మీటింగ్ ను నిర్వహించారు.ట్యాంకర్ బుకింగ్.. డెలివరీ, ఎం సీసీ ఫిర్యాదుల పరిష్కారంలో ప్రజలకు అసౌకర్యం కాకుండా ఎమర్జెన్సీ కంటిజెంటి ప్రణాలికను అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.ట్యాంకర్ బుకింగ్, డెలివరీ క్షేత్రస్థాయిలో.. సిబ్బందితో మ్యానువల్ గా ట్యాంకర్ సరఫరా చేపట్టాలని, దానికి సంబంధించిన వివరాలను పక్కాగా నమోదు చేయాలని అన్నారు.అలాగే, ఎం సీసీకి వచ్చే ఫిర్యాదుల కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపును ఏర్పాటుచేసి, పరిష్కరించడానికి మేనేజర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.అలాగే, తరుచూ నమోదయ్యే కలుషిత నీరు, సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫిర్యాదుల ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి, అప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు.డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎంలు, ఆయా ఫిల్లింగ్ స్టేషన్ ఇంచార్జీలు మేనేజర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
అలాగే, స్పెషల్ ఆఫీసర్ లు, నోడల్ ఆఫీసర్ లు, డీజీఎంలు.. ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ లను సందర్శించి, పరిస్థితిని సమీక్షించుకోవాలని ఆదేశించారు.అంతేకాకుండా పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చేవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు.భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తితే.. సమస్య పరిష్కారం కోసమై ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని రూపొందించుకోవాలని సూచించారు.గురువారం స్టేట్ డాటా సెంటర్ లో సాంకేతిక సమస్య కారణంగా జలమండలి పలు ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ సమస్యపై సాంకేతిక బృందం పరిష్కరించే దిశగా శ్రమిస్తోందని, సాధ్యమైనంత త్వరగా అన్నీ సేవలు పునరుద్ధరించేందుకు కృషి జరుగుతుందని.. ఈ సందర్భంగా జలమండలి ప్రకటించింది.