|
|
by Suryaa Desk | Tue, Jul 15, 2025, 03:38 PM
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గొల్లపల్లి మండలం గుంజపడు, పెగడపల్లి మండలం నంచర్ల గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. వారి వెంట ఆర్డివో మధుసూదన్, హౌసింగ్ డిఈ భాస్కర్ పాల్గొన్నారు.