|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 08:25 PM
తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత ఎన్. రాంచదర్‌రావు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. కొత్త అధ్యక్షుడి నియాకంపై చాలా కాలంగా చర్చ జరగుతోంది. రేసులో ఈటల రాజేందర్, లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపించగా.. అనుహ్యంగా రేసులో లేని రాంచందర్ రావు తెరపైకి వచ్చారు. పార్టీ అధిష్టానం ఆయన పేరును ఖరారు చేయటంతో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన ఎంపిక వెనుక ఏపీ సీఎం చంద్రబాబు హస్తం ఉన్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు.
తాజాగా రాంచందర్‌రావు ఎంపిక వెనుక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హస్తం ఉందని కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందని.. అందులో భాగంగానే అసలు రేసులోనేలేని రాంచందర్ రావును కొత్త కమల దళపతిగా ఎంపిక చేసినట్లు చెప్పుకొచ్చారు. కేంద్రంలో బీజేపీకి కావాల్సింది ఎంపీ సీట్లే కాబట్టి.. మద్దతు ఇచ్చేందుకు బీఆర్ఎస్ రెడీగా ఉండి ఓ డమ్మీని అధ్యక్షుడిగా చేసిందని చెప్పుకొచ్చారు.
'కిషన్ రెడ్డి- మైంహోం రామేశ్వరరావు- కేసీఆర్ ఇది ఓ లైన్‌అప్. ఈ లైన్‌అప్‌లోనే రాంచందర్ రావు గారిని వీరు ప్రపోజ్ చేసి ఉంటరు. కేసీఆర్ మీడియా కూడా రాంచందర్‌రావును హైలెట్ చేసింది. కేసీఆర్ ఆలోచన ప్రకారమే రాంచందర్ రావు నియామకం జరిగి ఉంటుంది. బీజేపీ అధికారంలోకి వచ్చే ఉద్దేశ్యం ఉంటే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్‌ను మార్చకుండా ఉండాల్సింది. అప్పటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉన్న సినారియో.. బండి సంజయ్ మార్పుతో అనుహ్యంగా కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. ఇప్పుడు బీజేపీ టార్గెట్ ఎంపీ సీట్లు. అందుకు బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీకి హామీ వచ్చి ఉండొచ్చు. ఈ రాష్ట్రం వరకు వదిలేయాలని బీఆర్ఎస్ బీజేపీని కోరి ఉంటది. బీజేపీని పెద్దగా పెరగనీయకుండా అట్ల ఉంచుర్రి అని అనుకోవచ్చు. అందులో భాగంగానే రాంచందర్ రావు ఎంపిక జరిగి ఉంటుంది.' అని తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్ చేశారు.