|
|
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 07:39 PM
రాజాసింగ్ విషయంలో బీజేపీ కీలక ప్రకటన చేసింది. రాజాసింగ్ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పింది. రాజాసింగ్ కు క్రమశిక్షణా రాహిత్యం పరాకాష్టకు చేరిందని తెలిపింది. 'ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్ రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్ కు లేఖ ఇవ్వాలి. మా పార్టీకి వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం. పార్టీ అధ్యక్షులకు ఇచ్చిన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపిస్తున్నాం' అని పేర్కొంది.రాజాసింగ్ క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్టకు చేరిందని, ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదని భాజపా అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్‌కు లేఖ పంపాలన్నారు. భాజపాకి వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమని చెప్పారు. పార్టీ అధ్యక్షులకు ఇచ్చిన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపుతున్నట్లు తెలిపారు.