![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 29, 2025, 01:51 PM
మహా న్యూస్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు ఎటువంటి స్థానం లేదని, మీడియా సంస్థలపై దాడులు చేయడం అంటే ప్రజల అభిప్రాయ స్వేచ్ఛను అణచివేయాలనే దురుద్దేశంతో కూడిన చర్య అని ఆయన అన్నారు.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఈ ఘటనను నిర్దాక్షిణ్యంగా చూడాలని, ఈ దాడిలో పాలుపంచుకున్నవారితో పాటు, ఈ దాడి వెనుక నిలిచినవారినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను సూచిస్తున్నానని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని, ప్రజాస్వామ్య విలువలను కాపాడడమే మనందరి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు.