![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 02:15 PM
నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారాన్ని ప్రాజెక్ట్ అధికారులు శనివారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 514.20 అడుగులుగా ఉందని అధికారులు తెలిపారు. కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయడం లేదన్నారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. జలాశయానికి అవుట్ ఫ్లో 450 క్యూసెక్కులు, ఇన్ ఫ్లో నిల్ క్యూసెక్కులుగా ఉందని తెలిపారు.