![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 03:43 PM
మేడిగడ్డ బ్యారేజీ మరియు మంజీరా బ్యారేజీల పరిస్థితిపై మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఆందోళన వ్యక్తం చేశారు. బ్యారేజీలకు జరిగిన నష్టంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ రెండు బ్యారేజీల రిపేర్ బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ వద్ద చరిత్రలో లేనంత వరద రావడంతో రెండు పిల్లర్లకు పగుళ్లు వచ్చిన సంగతి గుర్తు చేశారు. ఇదే తరహాలో ఇప్పుడు మంజీరా బ్యారేజీపై వరద ఒత్తిడి పెరిగి దిగువ భాగంలో పిల్లర్లకు పగుళ్లు రావడం, ఆఫ్రాన్ కొట్టుకుపోవడాన్ని SDSA నివేదికలో స్పష్టంగా చూపించిందని తెలిపారు.
అయితే, ముఖ్యమంత్రి ఈ నివేదికలపై స్పందించకుండా మొద్దు నిద్రలో ఉండటం దుర్మార్గమని కేటీఆర్ విమర్శించారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగే ముందు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. బ్యారేజీల భద్రత విషయంలో రాజీ పడకూడదని హితవు పలికారు.