|
|
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 02:41 PM
కృష్ణ ఎగువ పరివాహక ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అచ్చంపేట నియోజకవర్గంలోని శ్రీశైలం జలాశయానికి వరదనీటి ఉదృతి పెరుగుతుంది. జూరాల నుండి విద్యుత్ ఉత్పాదన ద్వారా 32, 156 క్యూసెక్కులు, గేట్ల ద్వారా 50, 597 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 1, 334 క్యూసెక్కులతో కలిపి 85, 087 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నాయి. గురువారం జలాశ నీటిమట్టం క్రమంగా పెరుగుతూ 860. 20 అడుగులకు చేరింది