![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 02:40 PM
విద్యార్థులు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్సై రామ్మూర్తి అన్నారు. యాంటీ డ్రగ్స్ వారోత్సవాల్లో భాగంగా గురువారం మండల పరిధిలోని వెంకటేశ్వర నగర్ లో విద్యార్థులతో కలిసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితం చీకటిమయం అవుతుందని ఎస్ఐ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.