![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 02:46 PM
ముందుచూపుతో, రైతు సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న బీఆర్‌ఎస్ నాయకత్వం మరోసారి విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు “రైతు భరోసా” నిధులు విడుదల చేయకపోతే ఔటర్ రింగ్ రోడ్డును దిగ్బంధిస్తామని మాజీ మంత్రి శ్రీ హరీష్ రావు గారు ఇటీవల జిన్నారం వద్ద జరిగిన రైతు ధర్నాలో గట్టిగా హెచ్చరించిన సంగతి తెలిసిందే.ఈ ప్రజా ఒత్తిడికి దిగివచ్చిన ప్రభుత్వం, రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. ఈ విజయవంతమైన ఉద్యమాన్ని పురస్కరించుకుని, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీ కాట రాజేష్ గౌడ్ గారు, పటాన్‌చెరు కోఆర్డినేటర్ శ్రీ వెన్నారం ఆదర్శ్ రెడ్డి గారు మరియు ఇతర నాయకులు కలిసి శ్రీ హరీష్ అన్నను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భం గర్వకారణంగా నిలిచింది.