|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 09:22 PM
రాష్ట్ర మంత్రివర్గంలో తమకు చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ గొల్ల కుర్మల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిరసనకారులు తమ వెంట గొర్రెలను తీసుకొచ్చి గాంధీ భవన్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గొర్రెలతో సహా లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. మంత్రివర్గంలో గొల్ల కుర్మలకు తక్షణమే చోటు కల్పించాలని, తమ వర్గానికి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.