|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 05:32 PM
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఓటమి తప్పదని, ఆ పార్టీ నుంచి మాజీ మంత్రి హరీశ్ రావు మినహా మరెవరూ గెలిచే అవకాశం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందని ఆరోపించిన ఆయన, ఆ పార్టీ నాయకులను తక్షణమే అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం బెదిరించి, సాయంత్రం వారితోనే మిలాఖత్ అయితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని ఆయన హితవు పలికారు.కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా త్వరలో నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారని ఆయన తెలిపారు. జూన్ 29వ తేదీన అమిత్ షా నిజామాబాద్‌కు విచ్చేసి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా, రైతుల చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభిస్తారని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. ఈ పరిణామం పసుపు రైతులకు ఒక నూతన శకాన్ని ఆరంభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.