|
|
by Suryaa Desk | Sun, Jun 22, 2025, 04:55 PM
ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో రేషన్‌దుకాణాల వద్ద లబ్ధిదారులు క్యూ కడుతున్నారు. ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించి బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో ఈనెల 1వ తేదీ నుంచి జనం బారులు కడుతూనే ఉన్నారు. కార్డుదారులు గ్రామాల్లో కన్నా గ్రేటర్హైదరాబాద్పరిధిలోనే రేషన్‌దుకాణాల వద్ద గంటల తరబడి నిలబడి రేషన్తీసుకుంటున్నారు. మూడు జిల్లాల పరిధిలోనే ప్రభుత్వం దుకాణాలకు కేటాయించిన కార్డుల కన్నా ఎక్కువ కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. డీలర్లు రెండు దఫాలుగా రేషన్‌కోటా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇతర జిల్లాల నుంచి జీవనోపాధికి వచ్చిన వలస కుటుంబాలు సొంత గ్రామాల్లో రేషన్‌కార్డు ఉంటే అక్కడ తీసుకోకుండా రాజధాని నగరంలోనే తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. గ్రేటర్‌వ్యాప్తంగా ఉన్న కార్డుల కన్నా నెలకు 1.25 లక్షలు కార్డులకు అదనంగా పంపిణీ చేస్తున్నారు. దీంతో రేషన్‌డీలర్లకు అదనపు భారంతోపాటు పనిగంటలు పెరుగుతోంది. వారం రోజుల్లోనే గ్రామాల్లో రేషన్పంపిణీ పట్టణాల్లో నెలంతా రేషన్‌దుకాణాలు జనంతో సందడిగా మారాయి. గ్రామాల్లో మాత్రం వారం రోజుల్లో సన్నబియ్యం పంపిణీ పూర్తి అవుతోంది. 600 కార్డులు కేటాయిస్తే అందులో 150 నుంచి 200 కార్డుల వరకు పట్టణాల్లోనే బియ్యం తీసుకుంటున్నారు. దీంతో గ్రేటర్‌పరిధిలోని ఉప్పల్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, హయత్‌నగర్, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, మలక్‌పేట, అంబర్‌పేట, కుత్బులాపూర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలోని దుకాణాల్లో ఎక్కువ సంఖ్యలో వలస వచ్చి కుటుంబాలు తీసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ గుర్తించింది. ఆయా ప్రాంతాలకు చెందిన డీలర్లకు రైస్కోటా ఎక్కువ కేటాయిస్తోంది. కొత్త దుకాణాలు ఏర్పాటు చేయాలి రేషన్‌కార్డుల సంఖ్య పెరిగిన ప్రాంతాల్లో కొత్త రేషన్‌దుకాణాలు ఏర్పాటు చేయాలని డీలర్లు కోరుతున్నారు. పట్టణాల్లో 1200 కార్డులు కేటాయించగా ఆన్లైన్విధానం వచ్చిన తరువాత 1500 కార్డులకుపైగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. వీటికి తోడు కొన్ని ఏరియాలో డీలర్లను తొలగించిన చోట పక్క డీలర్లకే బాధ్యతలు అప్పగించారు. కరోనా సమయంలో చనిపోయిన డీలర్ల స్థానంలోనూ కొత్తవారికి అవకాశం ఇవ్వలేదు. అక్కడ సైతం పక్క డీలర్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న రేషన్‌డీలర్లు అదనపు భారంతోపాటు సహాయకులను నియమించుకోవడంతో ఆర్థిక భారం పెరిగింది.