|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 01:34 PM
కామారెడ్డి పట్టణంలో 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాస్టర్ మైండ్స్ పాఠశాలలో క్రీడా భారతి ఆధ్వర్యంలో జరిగిన యోగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జపాన్ శాస్త్రవేత్త మరియు బీజేపీ రాష్ట్ర నేత పైడి ఎల్లారెడ్డి మాట్లాడారు. ఆయనను ఈ సందర్బంగా పాఠశాల వర్గాలు సత్కరించాయి.
ఈ సందర్భంగా పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ, “ఆనాడు యోగం ఆశ్రమాలకే పరిమితమై ఉండేది. కానీ నేడు అది ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందింది” అన్నారు. యోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి లాభాలే కాకుండా ఆధ్యాత్మిక శాంతి కూడా లభిస్తుందని చెప్పారు.
ప్రపంచ దేశాలు యోగాన్ని స్వీకరించి దానిలోని మౌలిక విలువలను గుర్తిస్తున్నాయని ఆయన అన్నారు. యోగం ఇప్పుడు భారతదేశానికే కాకుండా ప్రపంచానికి మార్గదర్శకంగా మారిందని కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాలు యువతలో ఆరోగ్యపరమైన చైతన్యం కలిగించేందుకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.