|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 08:24 PM
అమీన్పూర్ : అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని గండిగూడెంలో ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన ఫంక్షన్ హాల్ లో అతి త్వరలో ప్రారంభించినున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఫంక్షన్ హాల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫంక్షన్ హాల్ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. హాల్ నిర్మాణం కోసం రెండు కోట్ల రూపాయల సొంత నిధులు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. ఆధునిక వసతులతో ప్రజలందరికీ ఉపయోగపడేలా దీనిని తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. సుల్తాన్పూర్, దాయర, వడకపల్లి, జానకంపేట, తదితర గ్రామాల ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వివాహది శుభకార్యాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. అనంతరం ఫంక్షన్ హాల్ సమీపంలో నిర్మిస్తున్న గ్రామ దేవతల ఆలయాలను పరిశీలించారు. త్వరలోనే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అనంతరం సుల్తాన్పూర్ మల్లన్న గుడి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానంద్, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు రాజు, సత్యనారాయణ, భాస్కర్ గౌడ్, గోవింద్, తదితరులు పాల్గొన్నారు.