|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 12:10 PM
నగరంలో ప్రసిద్ధి చెందిన బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి రిలయన్స్ ట్రెండ్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ భారీ విరాళం అందజేశారు. ఎల్లమ్మ గుడికి కోటి రూపాయల విరాళం అందించారు నీతా అంబానీ. నేరుగా టెంపుల్ బ్యాంక్ ఖాతాకు విరాళాన్ని ట్రాన్సఫర్ చేశారు. గత ఏప్రిల్ నెలలో నీతా అంబానీ తల్లి పూర్ణిమ, సోదరి మమతా దలాల్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గుడి విశిష్టతను వారికి తెలియజేశారు ఆలయ అధికారులు. అంతేకాకుండా ఆలయ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఆలయ అధికారుల వినతిని తల్లి పూర్ణిమ నేరుగా నీతా అంబానీకి తెలియజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన నీతా అంబానీ ఆలయ అభివృద్ధి కోసం కోటి రూపాయలను విరాళంగా అమ్మవారి గుడి బ్యాంక్ ఖాతాలో వేశారు. ఈ మొత్తాన్ని ఫిక్సిడ్ డిపాజిట్ చేసి.. వచ్చే వడ్డీతో నిత్యాన్నదానం చేయాలని నిర్ణయించినట్లు టెంపుల్ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఇంతటి భారీ విరాళాన్ని అందించిన నీతా అంబానీ కుటుంబసభ్యులకు ఆలయ అధికారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక బల్కంపేట్ ఎల్లమ్మ తల్లికి నీతా అంబానీ పెద్ద భక్తురాలు అన్న విషయం అందిరికీ తెలిసిందే. నగరానికి ఎప్పుడు వచ్చినా కూడా ఎల్లమ్మను దర్శించుకుని వెళ్తుంటారు నీతా అంబానీ. ఈ క్రమంలో గత నెలలో నీతా అంబానీ తల్లి, సోదరి ఎల్లమ్మను దర్శించుకున్న సమయంలో ఆలయ అభివృద్ధి సహకరించాలని అధికారులు కోరారు. తల్లి కోరిక మేరకు.. అలాగే ఎల్లమ్మకు నీతా అంబానీ భక్తురాలు కావడంతో కోటి రూపాయల విరాళాన్ని ఆలయానికి అందజేశారు. అంతేకాకుండా దేశంలోని ప్రముఖ ఆలయాలను కూడా నీతా అంబానీ దర్శించుకుని భారీ విరాళాలు సమర్పించడం తెలిసిందే.