|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 10:45 AM
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానానికి రూ.1 కోటి విరాళం అందజేశారు. ఈ మొత్తం జూన్ 19న దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమ అయింది.అమ్మవారిపై ఎంతో నమ్మకంతో వస్తుండగా.. నీతా అంబానీకి దేవాలయ అధికారులు పలుమార్లు ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అయితే, ఇటీవల ఏప్రిల్ 23న హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ను తిలకించేందుకు నీతా అంబానీ కాకుండా వారి తల్లి పూర్ణిమా దలాల్, సోదరి మమతా దలాల్ వచ్చారు. ఈ క్రమంలోనే అప్పటి ఈవో బీ క్రిష్ణ మరోసారి ఆలయ అభివృద్ధి అంశాన్ని వారికి గుర్తు చేశారు. కాగా, వారం రోజుల కిందట నగరంలోని రిలయెన్స్ సంస్థ ప్రతినిధులు దేవాలయ అధికారులకు రూ.కోటి విరాళానికి సంబంధించిన విషయాన్ని వెల్లడించారు. రెండు రోజుల కిందట ఈ నిధులు దేవాలయ ఖాతాలో జమైనట్టు ఈవో మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అంబానీ కుటుంబానికి దేవస్థానం అధికారులు ధన్యవాదాలు తెలిపారు.