|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 08:06 PM
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ఉత్తర్వులను తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణం సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు, భువనగిరి ఎంపీఛామల కిరణ్ కుమార్ గారు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పంపిణీ చేశారు.గత ప్రభుత్వంలో వాసాలమర్రిని కేసీఆర్ దత్తత తీసుకుంట అని చెప్పి గ్రామాన్ని అధోగతి పలు చేశారు.నా దోస్తు ఆగవ్వ అని చెప్పి ఆకుల ఆగవ్వను ఆగం చేసి గ్రామంలో మొండి గోడలనే మిగిలిచ్చారు.అందుకే ఈ ప్రజా ప్రభుత్వంలో వాసాలమర్రి గ్రామంలో ముందుగా కేసీఆర్ దోస్తు ఆకుల ఆగవ్వకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందజేసి ఇల్లు నిర్మాణానికి మొదటగా లక్ష రూపాయలను ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు..