|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 04:49 PM
ఆసిఫాబాద్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డిక్లరేషన్ల పేరిట ఎస్సీ, ఎస్టీ వర్గాలను మోసం చేసిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలను నీరుగార్చారని ఆరోపించారు. బుధవారం ఆసిఫాబాద్‌లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే కోవా లక్షితో కలిసి ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 49 ద్వారా కవ్వాల్, తడోబా టైగర్ జోన్ పరిరక్షణ పేరిట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలను వంచిస్తోందని ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జీవో ఆదివాసీల హక్కులను కాలరాస్తోందని, వారి జీవనోపాధిని దెబ్బతీస్తోందని విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం గుండెల్లో పెట్టుకుని పనిచేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారి హక్కులను హరిస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ ధ్వజమెత్తారు. ఆదివాసీలకు న్యాయం చేయాలని, జీవో 49ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.