![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 05:07 PM
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు గంటల్లో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాదు వాతావరణ కేంద్రం ప్రకటించింది.
మోస్తరు స్థాయిలో వర్షం కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వర్ష సూచన ఉన్న జిల్లాలు ఇవే:
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాదు, జనగాం, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మల్కాజిగిరి, ములుగు, నాగర్కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి.
ప్రజలకు సూచనలు:
అవసరమైతే తప్ప బయటకు వెళ్లడం మానుకోవాలి. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దరిలో ఉండకూడదు. వ్యవసాయ కార్యకలాపాల్లో జాగ్రత్తలు పాటించాలి. వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు సంభవించే అవకాశం ఉండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.