|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 11:59 AM
బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌చేసి బాంబు పెట్టినట్టు చెప్పడంతో బేగంపేట పోలీసు అధికారులు, బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బెదిరింపు కాల్ నిజమా కాదా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.దీంతో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సీఐఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ముందుగా ఎయిర్‌పోర్టులో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది బయటకు పంపించేశారు ఎయిర్‌పోర్టు లోపల, పరిసర ప్రాంతాల్లో స్నిఫ్ఫర్ డాగ్స్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. బేగంపేట్ ఎయిర్‌పోర్టు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. మెయిల్ పంపింది ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.