|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 04:23 PM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే, కరెంట్ ఉండదని గత ప్రభుత్వ నేతలు దుష్ప్రచారం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. భూపాలపల్లి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమస్యలు ఉన్నవారు రాజధాని వరకు రాలేరని చెప్పారు. ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించేవాళ్లు ఉండటం గొప్ప విషయమని కొనియాడారు. ఈ ఏడాది మార్చిలో గరిష్ఠంగా 17,162 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడిందని చెప్పుకొచ్చారు.నిరంతరాయ విద్యుత్ సరఫరాకు కృషి చేసిన అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు. 29 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. సాగుకు ఉచిత విద్యుత్ కోసం రూ.11,500 కోట్లు కేటాయించాం. పేదల ఇళ్లకు గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. గృహజ్యోతి, ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ కోసం ఏటా రూ.13వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. 1 కోటి 49లక్షల 35వేల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తున్నాం’’అని భట్టి తెలిపారు.