సొంతింటి నిర్మాణానికి ప్రభుత్వం ఎంత ఇస్తుంది? ఎవరు అర్హులు
 

by Suryaa Desk | Fri, Jun 06, 2025, 08:23 PM

సొంతిల్లు నిర్మించుకోవడం అనేది ఎలాంటి వారికైనా ఒక అపురూపమైన కల. మరి పేదలకు సొంతిల్లు నిర్మించుకోవడం అనేది చాలా పెద్ద కల. పేదలకు, గూడు లేనివారికి సొంతింటి కలను నిజం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ‘ఇందిరమ్మ ఇళ్లు’. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో నిరుపేదలైన, సొంత ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం లేదా ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సాయం అందిస్తారు. ఈ పథకం పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు స్టేటస్ తెలుసుకునే విధానం, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తదితర వివరాలు..


ఇందిరమ్మ ఇళ్లు పథకం అంటే ఏమిటి?


తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి సహాయం అందించడమే ఇందిరమ్మ ఇళ్లు పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకం ద్వారా కింది విధంగా లబ్ధి చేకూరుస్తారు..


1) ఆర్థిక సహాయం: సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు.


2) స్థలం + ఆర్థిక సహాయం: సొంత స్థలం లేని వారికి ఇంటి స్థలం కేటాయించడంతో పాటు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు.


3) ఎస్సీ, ఎస్టీలకు అదనపు సహాయం: ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ. 5 లక్షలతో పాటు అదనంగా రూ. 1 లక్ష (మొత్తం రూ. 6 లక్షలు) ఆర్థిక సహాయం అందిస్తారు.


విడతల వారీగా చెల్లింపు:


ఇంటి నిర్మాణం వివిధ దశల్లో ఆర్థిక సహాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఉదాహరణకు.. పునాది పూర్తయిన తర్వాత రూ. 1 లక్ష, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత రూ. 1.25 లక్షలు, స్లాబ్ నిర్మాణ సమయంలో రూ. 1.75 లక్షలు అందిస్తారు.


రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 22,000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.


ఇందిరమ్మ ఇళ్లు పథకానికి ఎవరు అర్హులు?


దరఖాస్తుదారుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పర్మినెంట్ నివాసి అయి ఉండాలి.


దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, లేదా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల  ప్రజలు అర్హులు.


దళితులు, గిరిజనులు, మైనారిటీలు, ఇతర బలహీన వర్గాల వారికి ప్రాధాన్యం ఇస్తారు.


దరఖాస్తుదారుడికి లేదా అతడి కుటుంబానికి సొంత పక్కా ఇల్లు ఉండకూడదు.


గుడిసెలు, తాత్కాలిక ఇళ్లలో నివసించే వారికి ప్రాధాన్యం ఇస్తారు.


దరఖాస్తుదారుడు గతంలో ఏ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద లబ్ధి పొంది ఉండకూడదు (ముఖ్యంగా 1995 తర్వాత).


రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుడిని ఎంపిక చేస్తారు.


కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2 లక్షల కంటే తక్కువగా ఉండాలి.


ఒంటరి మహిళలు, వితంతువులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.


ఇందిరమ్మ ఇళ్లు అధికారిక వెబ్‌సైట్:


https://indirammaindlu.telangana.gov.in/


ఎలా దరఖాస్తు చేసుకోవాలి?


ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోనివారు.. MPDO, MRO కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్లు పథకం నిరంతరంగా కొనసాగుతుందని, అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోచ్చునని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గ్రామ పంచాయతీలు లేదా వార్డు కార్యాలయాలు లేదా మండల కార్యాలయాల నుంచి ప్రజా పాలన దరఖాస్తు పత్రాలను పొందవచ్చు. ఈ దరఖాస్తు ఫారమ్‌లను జాగ్రత్తగా నింపి, అవసరమైన పత్రాలను జతచేసి ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో సమర్పించాలి.


ఇందిరమ్మ ఇళ్లు పథకానికి దరఖాస్తులను ‘ప్రజా పాలన’ కార్యక్రమం ద్వారా స్వీకరించారు. 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించారు. ఇళ్ల కోసం మొత్తం 77.18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 36.03 లక్షల (46.7 శాతం) మంది మాత్రమే అర్హులని గుర్తించారు. మిగతా 41.15 లక్షల (53.3 శాతం) మందిని అనర్హులుగా తేల్చారు. అనర్హులందరూ దారిద్య్రరేఖ (బీపీఎల్‌)కు ఎగువన ఉన్నవారేనని అధికారులు నిర్ధారించారు.


మొత్తం దరఖాస్తుదారుల వివరాలను తెలంగాణ గృహ నిర్మాణ శాఖ ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 జాబితాలుగా సిద్ధం చేసింది. దీని ప్రకారమే ప్రతి ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున.. రాష్ట్రవ్యాప్తంగా ఏటా గరిష్టంగా 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


ఇళ్ల దరఖాస్తుల వివరాలను ఇందిరమ్మ యాప్‌లో నమోదు చేశారు. యాప్‌లో పొందుపరిచిన మార్గదర్శకాల ప్రకారం క్షేత్ర స్థాయిలో సిబ్బంది అన్ని కోణాల్లో సర్వేలు నిర్వహించారు. దీంతో పాటు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా తీసుకున్న వివరాలను కూడా పరిశీలించి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. దరఖాస్తుదారులను ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3గా విభజించారు.


ఆన్‌లైన్ దరఖాస్తు:


ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రస్తుతం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అందుబాటులో లేదు. భవిష్యత్తులో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించవచ్చు.


ఇందిరమ్మ ఇళ్ల పథకం దరఖాస్తుకు అవసరమైన పత్రాలు ఏంటి?


ఆధార్ కార్డు


రేషన్ కార్డు / ఆహార భద్రతా కార్డు (FSC)


కుటుంబ ఆదాయ ధ వీకరణ పత్రం (Income Certificate)


నివాస ధృవీకరణ పత్రం (Residence Certificate)


కుల ధృవీకరణ పత్రం (Caste Certificate) (అవసరమైతే)


మైనారిటీ ధృవీకరణ పత్రం (అవసరమైతే)


బ్యాంకు ఖాతా వివరాలు (బ్యాంకు పాస్‌బుక్ జీరాక్స్)


భూమి యాజమాన్య పత్రాలు (సొంత స్థలం ఉన్నవారికి)


దరఖాస్తుదారుడి పాస్‌పోర్ట్ సైజు ఫోటో


ఎలా ఎంపిక చేస్తారు?


లబ్ధిదారులను గుర్తించేందుకు ఇందిరమ్మ కమిటీలను నియమించారు. గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఇందిరమ్మ కమిటీలు ప్రధాన పాత్ర పోషించాయి. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి అధికారులకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించినట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. క్షేత్ర స్థాయి సిబ్బంది, అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు పలు విడతలుగా పరిశీలించి అర్హులను గుర్తిస్తున్నారు.


ఎంపికలో అతిపేదలు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఇస్తారు. పూరిగుడిసెలు లేదా పెంకుటిళ్ళలో నివసిస్తున్న వారికి తొలి దశలో ఇళ్లను నిర్మించి ఇస్తారు. గ్రామసభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల జాబితాలను గుర్తిస్తారు. తుది జాబితాను గ్రామసభలో ప్రదర్శించి, అభ్యంతరాలను స్వీకరిస్తారు. నియోజకవర్గాల వారీగా కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షిస్తారు.


మొబైల్ యాప్ ద్వారా పరిశీలన:


ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు యాప్ తీసుకొచ్చింది. ఈ మొబైల్ యాప్‌ల ద్వారా దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. అధికారులు దరఖాస్తుదారుల వద్దకు వెళ్లి ఫోటోలు తీసుకుని, వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. సొంత స్థలం ఉన్న వారిని అదే స్థలం దగ్గర ఉంచి, జియో ట్యాగింగ్ ద్వారా ఫోటో తీస్తున్నారు.


పార్టీలకు అతీతంగా, ఎలాంటి సిఫారసులకు తావులేకుండా, నిజమైన అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రయోజనం చేకూరాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రామాలు, పట్టణాల వారీగా ఎక్కడెక్కడ ఎన్ని కేటాయించాలనే దానిపై అధికారులు దృష్టి సారించారు. మొత్తం 3,500 ఇళ్లలో గ్రామాలు, పట్టణాల వారీగా మంజూరు చేసిన వాటి వివరాలను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి సమర్పిస్తే, ఆయన ఆమోదం తెలుపుతారు. అనంతరం ఎన్ని మంజూరయ్యాయో మళ్లీ గ్రామసభల్లో ప్రదర్శిస్తారు.


ఇందిరమ్మ ఇళ్లు - AI సాయంతో అక్రమాలకు చెక్


ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, బిల్లుల మంజూరులో ఏఐ (Artificial Intelligence) సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. ఇందిరమ్మ యాప్‌లో తప్పుడు సమాచారం నమోదు చేస్తే, సులభంగా గుర్తిస్తోంది. ఇందిరమ్మ యాప్‌లో గుంతలు, పునాది, పిల్లర్లు, స్లాబు, గోడలు, ఇంటి స్వరూపం లాంటి ఫొటోలను సిబ్బంది అప్‌లోడ్ చేశారు. దరఖాస్తుదారులకు సంబంధించిన సమగ్ర సమాచారం రికార్డై ఉంటుంది. పనుల పురోగతిపై యాప్‌లో వివరాలు నమోదు కాగానే, లబ్ధిదారుడి వివరాల ఆధారంగా ఏఐ వాటిని పరిశీలిస్తుంది. ఉండాల్సిన దానికంటే భిన్నంగా కనిపిస్తే వెంటనే గుర్తిస్తుంది. దీని ఆధారంగా అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి, అక్రమాలు తేలితే చర్యలు తీసుకుంటారు.


ఇళ్ల పునాది నిర్మాణాలు పూర్తి కాకున్నా, తప్పుడు ఫోటోలను అప్‌లోడ్‌ చేసి డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు చేసే ప్రయత్నాలను ఏఐ సాంకేతికతతో గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 18 ఇళ్ల నిర్మాణాల పునాదులు పూర్తయ్యాయంటూ బిల్లుల కోసం ఆన్‌లైన్‌లో వివరాలు, ఫొటోలు నమోదు చేయగా.. తేడా ఉన్నట్లు ఏఐ గుర్తించడంతో అధికారులు పరిశీలించి, బిల్‌ కలెక్టర్‌ను విధుల నుంచి తొలగించారు.


యాప్‌లో ఏఐ సాయంతో గుర్తించే అంశాలు:


లబ్ధిదారుల ముఖకవళికలు


ఇల్లు నిర్మించాల్సిన స్థలం అక్షాంశ, రేఖాంశాలు


ఇంటి స్వరూపం (ఆర్‌సీసీ/ ఏసీ షీట్‌/ తాటాకులు/ ప్లాస్టిక్‌ షీట్‌ రూఫ్‌)


ఇంటి నిర్మాణ దశల ఫొటోలు


లబ్ధిదారుడి వివరాలు


ఇందిరమ్మ ఇళ్లు స్కీమ్ 2025


యాప్‌ సర్వేలో ఇందిరమ్మ ఇంటికి అర్హులేనని తేలినప్పటికీ.. సమగ్ర కుటుంబ సర్వేలో ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లు, ఇతర ప్రాంతంలో ఇల్లు, కారు ఉన్నట్లు తేలితే, అలాంటివారిని అనర్హులుగా గుర్తించి దరఖాస్తులను పక్కన పెట్టేస్తున్నారు. పూర్తి వడపోత తర్వాత జూన్ 18న అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. జూన్ 21 నుంచి గ్రామసభలు ఏర్పాటు చేసి ఈ జాబితాలను ప్రదర్శిస్తారు. అభ్యంతరాలను పరిశీలించి, తుది జాబితాను సిద్ధం చేస్తారు. జూన్ 26వ తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తికానుంది.


దరఖాస్తు స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?


తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌ను (https://indirammaindlu.telangana.gov.in/) రూపొందించినప్పటికీ.. ప్రస్తుతం ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇందిరమ్మ ఇళ్లు పథకం దరఖాస్తు స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకునేందుకు వివరాలు లేవు. భవిష్యత్తులో ఆధార్ నంబర్/ మొబైల్ నంబర్/ రేషన్ కార్డు నంబర్ సాయంతో అప్లికేషన్ స్థితిని తెలుసుకునే సదుపాయాన్ని కల్పించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల విభజన ఇలా..


L1 (లిస్ట్ 1): సొంత స్థలం ఉండి, పక్కా ఇల్లు లేని వారు. వీరికి మొదటి విడతలో ప్రాధాన్యం ఇస్తారు. సొంత స్థలంలో గుడిసె, పూరిపాక, మట్టిమిద్దెలు, రేకుల ఇళ్లు ఉన్నవారిని కూడా ఈ జాబితాలో చేర్చారు.


L2 (లిస్ట్ 2): సొంత స్థలం లేదా పక్కా ఇల్లు లేని పౌరులు. గుడిసెల్లో, తాత్కాలిక ఇళ్లలో నివాసం ఉంటున్నవారు. వీరికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి సహాయం అందిస్తారు.


L3 (లిస్ట్ 3): ఇప్పటికే పక్కా ఇల్లు ఉండి, వార్షికాదాయం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు. వీరు ఈ పథకానికి అర్హులు కారు.


ఇందిరమ్మ ఇళ్ల పథకం టోల్ ఫ్రీ నంబర్:


ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలను నివృత్తి చేసుకోవడానికి లేదా ఫిర్యాదులు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం 040-29390057 అనే టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నంబర్‌కు పని దినాల్లో కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు.


ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQs):


ఇందిరమ్మ ఇళ్లు పథకానికి ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?


తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్లు పథకానికి ప్రస్తుతం ఆన్‌లైన్ దరఖాస్తు విధానం అందుబాటులో లేదు. ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తులను సమర్పించాలి. మీ గ్రామ పంచాయతీ/వార్డు సచివాలయం లేదా సంబంధిత మండల స్థాయి కార్యాలయాలను (MPDO/MRO ఆఫీసులు) సంప్రదించి దరఖాస్తు ఫారమ్‌లు పొందవచ్చు. తాజా సమాచారం తెలుసుకోవచ్చు.


నాకు పెళ్లై, పిల్లలున్నారు. కానీ, మా నాన్న గారు నిర్మించిన ఇంట్లో ఓ వైపు విడిగా ఉంటున్నాం (వేరు కాపురం). నాకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సొంతిల్లు మంజూరు చేస్తారా? (ఓ సోదరుడు)


మీ కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షల రూపాయలకు మించకుంటే, మీకు వారసత్వంగా ఎలాంటి ఆస్తులు (విలువైనవి) లేకపోతే.. ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద మీకు ఇల్లు మంజూరు చేస్తారు. మీకు సొంత స్థలం ఉంటే, తొలి దశలోనే మంజూరు చేస్తారు.


గతంలో మేం ప్రభుత్వం కేటాయించే ఇంటి కోసం దరఖాస్తు చేసుకొని, రాకపోవడంతో రేకుల ఇల్లు నిర్మించుకున్నాం. ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద మాకు పక్కా ఇల్లు నిర్మించుకునేందుకు అవకాశం ఉంటుందా..?


అవును. మీరు రేకుల ఇంటి స్థానంలో పక్కా ఇంటిని నిర్మించుకోవచ్చు. నిబంధనల ప్రకారం మీరు అర్హులైతే, ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద లబ్ధిదారుడిగా గుర్తిస్తారు. సొంత స్థలం కూడా ఉంది కాబట్టి తొలి దశలోనే ఇంటిని నిర్మించుకునేందుకు అవకాశం దక్కవచ్చు.


మా గ్రామంలో పేదలను పక్కనబెట్టి, అనర్హులను ఇందిరమ్మ ఇళ్లు పథకానికి ఎంపిక చేశారు? ఎవరికి ఫిర్యాదు చేయాలి?


మీరు తగిన ఆధారాలతో జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 040-29390057 కు కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చు.


మేం జీవనోపాధి కోసం హైదరాబాద్‌‌కు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాం. మాకు సొంతూరులో రేషన్ కార్డు ఉంది కానీ, మా ఇల్లు శిథిలమై కూలిపోయింది. ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద కొత్త ఇల్లు మంజూరు చేస్తారా?


మీరు ఇందిరమ్మ ఇళ్లు పథకానికి అర్హులే. కూలిపోయిన ఇంటి స్థానంలో కొత్త ఇల్లు నిర్మించుకోవచ్చు. ఎంపీడీవో లేదా ఎమ్మార్వో కార్యాలయంలో సంప్రదించి మీరు దరఖాస్తు పత్రాన్ని సమర్పించండి.

నిర్మల్ జిల్లాలో మాతృ మరణాలకు అడ్డుకట్ట వేసిన పథకం Tue, Dec 16, 2025, 07:33 PM
ఇదే వార్డులను పెంచడానికి ముఖ్య కారణం .. జీహెచ్ఎంసీ కమిషనర్ Tue, Dec 16, 2025, 07:28 PM
సిడ్నీలోని బోండి బీచ్‌లో కాల్పుల ఘటన.. నిందితుడిది హైదరాబాదే Tue, Dec 16, 2025, 07:22 PM
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల తేదీల్లో మార్పులు Tue, Dec 16, 2025, 07:19 PM
మరోసారి పోలీస్‌ కస్టడీకి ఐబొమ్మ రవి Tue, Dec 16, 2025, 07:00 PM
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా: మంత్రి సీతక్క Tue, Dec 16, 2025, 06:51 PM
ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఎలక్ట్రిక్‌ బైక్‌పై వచ్చిన గడ్డం వంశీ Tue, Dec 16, 2025, 04:49 PM
కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కలిసిన సీఎం రేవంత్ రెడ్డి Tue, Dec 16, 2025, 04:44 PM
యూరియా కొనుగోళ్ల కోసం త్వరలోనే యాప్‌ను తీసుకురానున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు Tue, Dec 16, 2025, 04:40 PM
సిడ్నీ దాడి.. నిందితులకు హైదరాబాద్ లింక్! Tue, Dec 16, 2025, 04:33 PM
నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు Tue, Dec 16, 2025, 04:31 PM
పెళ్లి చేసుకుంటానని మోసం.. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా Tue, Dec 16, 2025, 04:24 PM
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి Tue, Dec 16, 2025, 03:57 PM
ఇన్సూరెన్స్ సొమ్ము కోసం చనిపోయినట్లు నటించిన వ్యక్తి అరెస్ట్ Tue, Dec 16, 2025, 03:08 PM
మార్చి 26, 2026న ప్రారంభం కానున్న ఐపీఎల్ Tue, Dec 16, 2025, 03:05 PM
నేపాల్ లో భారత కరెన్సీ వాడేవారికి శుభవార్త Tue, Dec 16, 2025, 03:04 PM
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్ Tue, Dec 16, 2025, 03:02 PM
నేడు ప్రారంభమైన ఐపీఎల్ ఆటగాళ్ల మినీ వేలం Tue, Dec 16, 2025, 03:01 PM
మార్చి 4న ప్రారంభం కానున్న ఇంటర్ సెకండియర్ పరీక్షలు Tue, Dec 16, 2025, 02:59 PM
ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలిగించడం తీరని ద్రోహం Tue, Dec 16, 2025, 02:58 PM
'అడల్ట్ మోడ్'ను ప్రవేశపెట్టనున్న AI Tue, Dec 16, 2025, 02:57 PM
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీకి ఊరట Tue, Dec 16, 2025, 02:54 PM
బీజేపీపై మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన కిషన్ రెడ్డి Tue, Dec 16, 2025, 02:53 PM
అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన కారు Tue, Dec 16, 2025, 02:05 PM
జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద BJP ఆందోళన Tue, Dec 16, 2025, 12:08 PM
పోలీసులు డ్యూటీ సరిగ్గా చేయకపోతే మేమే డ్యూటీ చేస్తాం: KTR Tue, Dec 16, 2025, 12:01 PM
రాహుల్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్ Tue, Dec 16, 2025, 11:43 AM
తెలంగాణలో మూడు రోజులపాటు చలి తీవ్రత: వాతావరణ శాఖ హెచ్చరిక Tue, Dec 16, 2025, 11:41 AM
ఎన్నికల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి: సత్తుపల్లిలో అదనపు కలెక్టర్ పర్యటన Tue, Dec 16, 2025, 11:25 AM
మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం: పకడ్బందీ ఏర్పాట్లు చేసిన కలెక్టర్ Tue, Dec 16, 2025, 11:23 AM
ఖమ్మం మూడో విడత ఎన్నికలకు భారీ బందోబస్తు.. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట చర్యలు Tue, Dec 16, 2025, 11:21 AM
నైపుణ్య సాధనతోనే జీవితంలో ఉన్నత శిఖరాలు: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి Tue, Dec 16, 2025, 11:19 AM
భూగర్భ జలాల పెంపునకు జలమండలి యాక్షన్ ప్లాన్..! Tue, Dec 16, 2025, 10:59 AM
హైదరాబాద్ పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం Tue, Dec 16, 2025, 10:43 AM
పౌర సమస్యలపై చందానగర్ డిప్యూటీ కమిషనర్‌కు బీజేపీ వినతి Tue, Dec 16, 2025, 10:41 AM
తల్లిదండ్రులను రోడ్డుపై వదిలేస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్ Tue, Dec 16, 2025, 10:39 AM
రోడ్డు ప్రమాదంలో ఉద్యమకారుడు మృతి... వీడ్కోలు పలికిన నేతలు Tue, Dec 16, 2025, 10:33 AM
పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం: సోమ శ్రీనివాస్ గుప్త Mon, Dec 15, 2025, 08:07 PM
కలెక్టరేట్ లో సమస్యల పరిష్కారానికి ఆదేశాలు Mon, Dec 15, 2025, 08:07 PM
జంకుతండ సర్పంచ్ గా చిన్న ధనమ్మ విజయం Mon, Dec 15, 2025, 08:05 PM
గోదావరి నది ఒడ్డున తవ్వకాలు.. బయటపడ్డ సింహవాహిని దుర్గాదేవి విగ్రహం Mon, Dec 15, 2025, 07:49 PM
రైతులకు రూ.503 కోట్లు విడుదల.. ఖాతాల్లో జమ Mon, Dec 15, 2025, 07:45 PM
జీహెచ్‌ఎంసీ డివిజన్ల పెంపుపై అభ్యంతరాలు.. హైకోర్టులో పిటిషన్ Mon, Dec 15, 2025, 07:40 PM
ఒక్క రూపాయితో.. అన్నం, పప్పు, కూర, పెరుగుతో కూడిన సంపూర్ణ భోజనం Mon, Dec 15, 2025, 07:36 PM
హౌస్‌ అరెస్టుల మధ్య ,,,,ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహావిష్కరణ Mon, Dec 15, 2025, 07:31 PM
గ్యారెంటీల అమలులో వైఫల్యమే కాంగ్రెస్ ఓటమికి కారణమన్న కేటీఆర్ Mon, Dec 15, 2025, 04:53 PM
ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి Mon, Dec 15, 2025, 03:23 PM
కార్పొరేట్, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతాం Mon, Dec 15, 2025, 03:20 PM
భట్టి విక్రమార్క ఇలాకాలో ఓడిపోయిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థుల దౌర్జన్యాలు! Mon, Dec 15, 2025, 03:18 PM
రోడ్డు ప్రమాదంలో MBBS విద్యార్థిని మృతి Mon, Dec 15, 2025, 02:50 PM
కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి: ఎమ్మెల్యే Mon, Dec 15, 2025, 02:42 PM
నవీపేట్ గ్రామ సర్పంచులుగా గెలుపొందిన వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సన్మానం Mon, Dec 15, 2025, 02:40 PM
తెలంగాణ: విత్తన రంగంలో అగ్రగామిగా - నూతన విధానంతో మెగా ప్లాన్ Mon, Dec 15, 2025, 02:29 PM
హోరాహోరీ పోరు.. ఒక్క ఓటుతో సర్పంచ్‌ పీఠం! Mon, Dec 15, 2025, 02:27 PM
పంచాయతీ ఎన్నికల్లో బీసీ వాదాన్ని బలహీనపరుస్తున్నారని నాయకుల ఆరోపణ Mon, Dec 15, 2025, 02:26 PM
తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళనపై కసరత్తు.. మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు! Mon, Dec 15, 2025, 02:23 PM
ఖాకీ వదిలి ఖద్దరులోకి.. రాజీనామా చేసి మరీ పోటీ చేసిన ఎస్సైకి గ్రామస్తులు భారీ షాక్! Mon, Dec 15, 2025, 02:19 PM
వరుసగా రెండుసార్లు సర్పంచులుగా ఎన్నికైన భార్యాభర్తలు Mon, Dec 15, 2025, 02:11 PM
గడ్డివాము దగ్ధం ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి – రైతుల ఆగ్రహం Mon, Dec 15, 2025, 02:01 PM
రైల్వే ప్రాజెక్టులు.. తెలంగాణలో 'నత్త నడక'కు కారణాలేంటి? Mon, Dec 15, 2025, 01:58 PM
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో వంట మనుషుల సంఖ్యపై కొత్త మార్గదర్శకాలు.. విద్యార్థుల సంఖ్యే ప్రామాణికం Mon, Dec 15, 2025, 01:46 PM
అతివేగం బలిగొన్న నిండు ప్రాణం.. టీ తాగేందుకు వెళ్తుండగా మృత్యువు కబళించింది Mon, Dec 15, 2025, 01:20 PM
కట్నం దాహం.. కోడలిని కొట్టి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరణ! Mon, Dec 15, 2025, 01:15 PM
ప్రధాని విదేశీ పర్యటనలకు పొగమంచుతో జాప్యం Mon, Dec 15, 2025, 12:55 PM
పంచాయతీ ఎన్నికల్లో పోటీకోసం ఉద్యోగాన్ని వదిలేసిన పోలీసు, ఐనా లభించని విజయం Mon, Dec 15, 2025, 12:51 PM
పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తాం Mon, Dec 15, 2025, 12:49 PM
పంచాయతీ ఎన్నికల్లో పోటీపడిన తండ్రీకొడుకులు, గెలిచిన తండ్రి Mon, Dec 15, 2025, 12:47 PM
'ఉక్కు మనిషి' సర్దార్ పటేల్ వర్ధంతి.. నివాళులర్పించిన ప్రజలు, మరువలేని సేవలను స్మరణ Mon, Dec 15, 2025, 12:46 PM
నేడు హైదరాబాద్ లో కన్హా శాంతి వనాన్ని సందర్శించనున్న చంద్రబాబు Mon, Dec 15, 2025, 12:43 PM
ఖమ్మంలో గ్రానైట్ లారీ బీభత్సం.. రింగ్ సెంటర్ వద్ద కిందపడ్డ భారీ బండరాళ్లు, తప్పిన పెను ప్రమాదం Mon, Dec 15, 2025, 12:42 PM
అక్రమ సంబంధంతో భర్తని హతమార్చిన భార్య Mon, Dec 15, 2025, 12:40 PM
తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి, స్కూళ్లకు సెలవులు Mon, Dec 15, 2025, 12:40 PM
కరీంనగర్‌ లో కంటబడ్డ అరుదైన పునుగు Mon, Dec 15, 2025, 12:40 PM
హరీశ్‌ రావు మీద నాకు ఎటువంటి విభేదాలు లేవు, కవిత మాటలపై స్పందించిన జగ్గారెడ్డి Mon, Dec 15, 2025, 12:38 PM
గ్రామీణ ప్రాంతాల్లో పట్టు నిలుపుకున్న కాంగ్రెస్ Mon, Dec 15, 2025, 12:37 PM
ధన్వాడ, దమగ్నాపూర్ సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయ నేతల స్వగ్రామాల్లో ఆసక్తికర పోరు Mon, Dec 15, 2025, 12:14 PM
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య Mon, Dec 15, 2025, 12:09 PM
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకే అధిక మద్దతు: ఎమ్మెల్యే మేఘారెడ్డి Mon, Dec 15, 2025, 11:47 AM
బీఆర్ఎస్ పాలనలో వేలకోట్లు దోచుకున్నారు: కోమటిరెడ్డి Mon, Dec 15, 2025, 11:03 AM
తుది విడత ప్రచారానికి నేడు తెర Mon, Dec 15, 2025, 10:48 AM
సర్పంచ్, వార్డు సభ్యురాలిగా డబుల్ విక్టరీ సాధించిన మహిళ Mon, Dec 15, 2025, 10:42 AM
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ.. కాంగ్రెస్‌దే హవా Mon, Dec 15, 2025, 10:35 AM
బ్రహ్మోత్సవాల నాటికి రైల్వేస్టేషన్ ను ప్రారంభిస్తాము: ఎంపీ Mon, Dec 15, 2025, 10:33 AM
త్వరలో తెలంగాణ కేబినెట్‌లో మార్పులు.. వీరికి ఛాన్స్ Mon, Dec 15, 2025, 10:30 AM
డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికితే రూ.10 వేలు ఫైన్,,,,కఠిన నిబంధనలు జారీ చేసిన నగర సీపీ Sun, Dec 14, 2025, 09:07 PM
సర్పంచ్ ఎన్నికల్లో ఓటుకు రూ.40 వేలు.. రూ.17 కోట్లు ఖర్చు Sun, Dec 14, 2025, 09:05 PM
మరో ఉద్యమానికి సిద్ధమైన బీఆర్ఎస్.. రంగంలోకి కేసీఆర్ Sun, Dec 14, 2025, 09:03 PM
ఏస్పీ బాలు విగ్రహం వివాదం,,,,వేరే స్థలం చూసుకోవాలని కల్వకుంట్ల కవిత వ్యాఖ్య Sun, Dec 14, 2025, 07:32 PM
గ్రామ పంచాయతీ ముందే....సర్పంచ్ ఎన్నికల వేళ క్షుద్ర పూజల కలకలం Sun, Dec 14, 2025, 07:28 PM
ఆసియాలోనే టాప్ షాపింగ్ స్ట్రీట్స్ హైదరాబాద్‌లో ఇదే Sun, Dec 14, 2025, 07:24 PM
రేషన్ కార్డు దారుల ఈ-కేవైసీ ఈనెల గడువు 31 వరకే ,,,, లేకపోతే రేషన్ బంద్ Sun, Dec 14, 2025, 07:19 PM
హైదరాబాద్ బిర్యానీ, హలీమ్‌కు ఫిదా అయిన మెస్సీ Sun, Dec 14, 2025, 07:15 PM
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం.. TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు Sun, Dec 14, 2025, 04:57 PM
అంగవైకల్యం అడ్డురాకుండా.. తండ్రి భుజాలపై పోలింగ్ బూత్‌కు చేరిన యువతి Sun, Dec 14, 2025, 04:54 PM
దక్షిణాఫ్రికాలో కుప్పకూలిన హిందూ దేవాలయం Sun, Dec 14, 2025, 04:36 PM
తెలంగాణ అంటే క్రీడలు అనేది ప్రపంచానికి చాటిచెప్పాము Sun, Dec 14, 2025, 04:34 PM
ఏఐ రంగంలో భారత్ మూడవస్థానం Sun, Dec 14, 2025, 04:34 PM
ఓటర్లని డబ్బుతో ప్రలోభపెడుతున్నారని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన సర్పంచ్ అభ్యర్థి Sun, Dec 14, 2025, 04:31 PM
నేడు కొనసాగుతున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు Sun, Dec 14, 2025, 04:29 PM
ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన Sun, Dec 14, 2025, 01:38 PM
పోలీసు కానిస్టేబుల్ మానవత్వం.. 90 ఏళ్ల వృద్ధురాలికి వీల్‌చైర్‌లో ఓటు వేయించిన కరుణాకర్‌కు ప్రశంసలు Sun, Dec 14, 2025, 01:27 PM
శివంపేటలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ Sun, Dec 14, 2025, 01:22 PM
జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలంలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం Sun, Dec 14, 2025, 01:10 PM
సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి Sun, Dec 14, 2025, 01:07 PM
తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు.. ఉత్సాహకర పోలింగ్, కొన్ని చోట్ల ఘర్షణలు Sun, Dec 14, 2025, 12:11 PM
డబ్బు పంపిణీ ఆరోపణలపై సర్పంచ్ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కి నిరసన Sun, Dec 14, 2025, 12:07 PM
పంచాయతీ ఎన్నికల్లో భారీ ఖర్చుల ఆరోపణలు.. సంగారెడ్డి జిల్లాలో రూ.17 కోట్లు? Sun, Dec 14, 2025, 12:03 PM
ఓట్ల కోసం డబ్బులు పంచి... ఓడిపోయి వసూలుకు దిగిన అభ్యర్థి! Sun, Dec 14, 2025, 11:51 AM
అవంచలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తత Sun, Dec 14, 2025, 11:40 AM
ఝరాసంగం మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. గ్రామీణ ఓటర్ల ఉత్సాహం ఆకట్టుకుంది Sun, Dec 14, 2025, 11:37 AM
పటాన్చెరు బీఆర్ఎస్ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ అడ్వకేట్‌గా నమోదు Sun, Dec 14, 2025, 11:24 AM
తెలంగాణ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు.. సంగారెడ్డి జిల్లాలో ఉదయం నుంచే పోలింగ్ జోరు Sun, Dec 14, 2025, 11:15 AM
ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. ఉదయం 9 గంటలకు 27.78% పోలింగ్ నమోదు Sun, Dec 14, 2025, 11:11 AM
ఖమ్మం జిల్లాలో రోడ్డు విస్తరణ పనులు జోరుగా ప్రారంభం Sun, Dec 14, 2025, 11:06 AM
లక్కీ డ్రా ద్వారా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయింపు Sat, Dec 13, 2025, 08:59 PM
సర్పంచ్ ఎన్నికల బరిలో ఎంబీబీఎస్ విద్యార్థిని Sat, Dec 13, 2025, 08:58 PM
కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని వ్యాఖ్య Sat, Dec 13, 2025, 08:55 PM
182 మంది సస్పెండ్....ఆ ఉద్యోగులకు బిగ్‌షాక్ ఇచ్చిన కలెక్టర్ Sat, Dec 13, 2025, 07:40 PM
మూడు నెలల్లోనే నవ వధువు ఆత్మహత్య Sat, Dec 13, 2025, 07:35 PM
ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు.. మెస్సి మ్యాచ్ పూర్తి షెడ్యూల్ ఇదే Sat, Dec 13, 2025, 07:30 PM
గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వారికి బీజేపీ సన్మానం Sat, Dec 13, 2025, 07:29 PM
ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసుల భారీ బందోబస్తు Sat, Dec 13, 2025, 07:27 PM
కరెక్ట్ సమయంలో పామాయిల్ కు పెరిగిన ధరలు.. అభినందనలు చెప్పిన మంత్రి Sat, Dec 13, 2025, 07:25 PM
మైలార్దేవపల్లి డివిజన్ విభజనపై అభ్యంతరాలు, పేర్ల మార్పుపై వినతి Sat, Dec 13, 2025, 07:25 PM
ఒకే కుటుంబంలో ముగ్గురు సర్పంచ్‌లు Sat, Dec 13, 2025, 07:21 PM
స్థానిక ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయన్న ఈటల Sat, Dec 13, 2025, 04:39 PM
అదిలాబాద్ జిల్లాలో దారుణం.. తల్లి కూతురిపై పాశవిక దాడి Sat, Dec 13, 2025, 04:39 PM
కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు Sat, Dec 13, 2025, 04:27 PM
ఆత్మకూరు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహాలు పూర్తి Sat, Dec 13, 2025, 04:23 PM
జగిత్యాల జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు Sat, Dec 13, 2025, 04:22 PM
జగిత్యాలలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన Sat, Dec 13, 2025, 04:18 PM
సర్పంచ్ అభ్యర్థి ఆకుల మణి వినూత్న హామీ.. ఆటో డ్రైవర్లు, హమాలీలకు ఆరోగ్య బీమా Sat, Dec 13, 2025, 04:14 PM
జగిత్యాల కలెక్టర్ సారంగాపూర్‌లో ఎన్నికల సన్నాహాల పరిశీలన Sat, Dec 13, 2025, 04:11 PM
అయిలాపూర్ గ్రామ సర్పంచ్‌గా భారీ మెజారిటీతో విజయం సాధించిన ద్యావన పెల్లి రామకృష్ణ Sat, Dec 13, 2025, 04:07 PM
మెస్సీ టూర్.. కోల్‌కతా అల్లర్లు హెచ్చరిక.. హైదరాబాద్‌లో భద్రతా కట్టుదిట్టం! Sat, Dec 13, 2025, 04:02 PM
జహీరాబాద్ నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు భారీ భద్రతా ఏర్పాట్లు Sat, Dec 13, 2025, 04:01 PM
అత్యధిక వయసు సర్పంచ్‌గా రికార్డు సృష్టించిన 95 ఏళ్ల రామచంద్రారెడ్డి Sat, Dec 13, 2025, 04:01 PM
సంగారెడ్డి జిల్లాలో బీజేపీ మద్దతు పొందిన విజేతలకు జిల్లా అధ్యక్షురాలు సన్మానం Sat, Dec 13, 2025, 03:58 PM
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు: ఇంచార్జి కలెక్టర్ Sat, Dec 13, 2025, 03:40 PM
గ్రామపంచాయతీ ఎన్నికల్లో సోషల్ మీడియాదే కీలకపాత్ర Sat, Dec 13, 2025, 03:22 PM
జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ ను కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Sat, Dec 13, 2025, 03:19 PM
సర్పంచ్ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా బీఆర్ఎస్ Sat, Dec 13, 2025, 03:15 PM
మెస్సీ మ్యాచ్: ఉప్పల్ స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత Sat, Dec 13, 2025, 03:09 PM
హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ ఉత్సవం.. రేవంత్ రెడ్డి vs మెస్సీ మ్యాచ్ ఈరోజు! Sat, Dec 13, 2025, 02:58 PM
తెలంగాణ టెన్త్ పరీక్షలు: నెలరోజుల షెడ్యూల్‌పై భిన్నాభిప్రాయాలు Sat, Dec 13, 2025, 02:29 PM
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు Sat, Dec 13, 2025, 01:50 PM
పెళ్లైన 3 నెలలకే నవ వధువు ఆత్మహత్య Sat, Dec 13, 2025, 01:49 PM
నిర్మల్ జిల్లాలో దారుణం.. మంత్రాల నెపంతో హత్య! Sat, Dec 13, 2025, 12:55 PM
రఘునాథపాలెం మండలంలో బీఆర్ఎస్ ఘనవిజయం.. ప్రజాబలమే కీలకమని నాయకులు Sat, Dec 13, 2025, 12:35 PM
కవ్వాల్ సర్పంచ్ గా సక్రు నాయక్ విజయం, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అభినందన Sat, Dec 13, 2025, 12:10 PM
ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. చివరికి? Sat, Dec 13, 2025, 12:03 PM
TGCET-2026: గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ Sat, Dec 13, 2025, 12:01 PM
సర్పంచ్ ఎన్నికల టెన్షన్.. మాజీ ఎంపీపీ కారుకు నిప్పు Sat, Dec 13, 2025, 12:01 PM
బీసీలకు తప్పకుండా అండగా నిలుస్తాం Sat, Dec 13, 2025, 11:39 AM
మేడ్చల్-మల్కాజిగిరిలో ఆక్రమణలపై హైడ్రా కొరడా Sat, Dec 13, 2025, 11:38 AM
రాష్ట్రంలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు Sat, Dec 13, 2025, 11:37 AM
నేడు హైదరాబాద్ రానున్న రాహుల్ గాంధీ Sat, Dec 13, 2025, 11:37 AM
పైపులైన్‌ లీకేజీ... తాగునీటి సరఫరాకు అంతరాయం Sat, Dec 13, 2025, 11:11 AM
టికెట్లు ఉన్నవాళ్లే మ్యాచ్ కు రావాలి: సీపీ సుధీర్ బాబు Sat, Dec 13, 2025, 10:45 AM
రెండో విడతలో ఈ గ్రామాల్లో ఏకగ్రీవం Sat, Dec 13, 2025, 10:32 AM
అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ Sat, Dec 13, 2025, 10:30 AM
భార్యను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టి.. ఆపై భర్త ఉరేసుకొని మృతి Sat, Dec 13, 2025, 10:23 AM
రేపు ఎన్నికలు.. సర్పంచ్ అభ్యర్థికి గుండెపోటు Sat, Dec 13, 2025, 10:22 AM
ఉప్పల్ స్టేడియంలో మెస్సీ రేవంత్ జట్ల మధ్య మ్యాచ్ వీక్షించడానికే రాహుల్ హైదరాబాద్ పర్యటన Sat, Dec 13, 2025, 07:24 AM
కబ్జాదారుల నుంచి 10 ఎకరాలను స్వాధీనం చేసుకున్న హైడ్రా Fri, Dec 12, 2025, 10:55 PM
బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామన్న మహేశ్ కుమార్ గౌడ్ Fri, Dec 12, 2025, 10:52 PM
కాంగ్రెస్ వరుస ఓటములపై రాహుల్, ఖర్గే లేఖ–సోనియాకు సూచనలు Fri, Dec 12, 2025, 09:06 PM
సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్ ఇదే Fri, Dec 12, 2025, 08:51 PM
కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు : నీలం మధు ముదిరాజ్.. Fri, Dec 12, 2025, 08:27 PM
తీన్మార్ మల్లన్నపై హెచ్ఆర్సీకి యూట్యూబర్స్ ఫిర్యాదు Fri, Dec 12, 2025, 08:25 PM
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించాలి Fri, Dec 12, 2025, 08:23 PM
ఈనెల 22న మాక్ ఎక్సర్సైజు నిర్వహించాలి Fri, Dec 12, 2025, 08:17 PM
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు! Fri, Dec 12, 2025, 08:15 PM
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించాలి Fri, Dec 12, 2025, 07:54 PM
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరింత సులభతరం,,,, ఆర్టీసీ స్మార్ట్ కార్డు Fri, Dec 12, 2025, 07:32 PM
వికటించిన మధ్యాహ్న భోజనం.. 44 మంది విద్యార్థులకు అస్వస్థత Fri, Dec 12, 2025, 07:25 PM
టాలీవుడ్‌కు మంత్రి కోమటిరెడ్డి హెచ్చరిక Fri, Dec 12, 2025, 07:22 PM
మీది మాది ఒకే కులం అని చెప్పి....గెస్ట్ ఫ్యాకల్టీపై ప్రొఫెసర్ లైంగిక దాడి Fri, Dec 12, 2025, 07:21 PM
నేను ఏదో ఒక రోజు సీఎం అవుతా.. అప్పుడు చెబుతా వారి పని Fri, Dec 12, 2025, 07:16 PM
తెలంగాణకు కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు,,,,,కేంద్రం గ్రీన్‌సిగ్నల్ Fri, Dec 12, 2025, 07:13 PM
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి.. KTR కౌంట్‌డౌన్ ప్రారంభమని వ్యాఖ్యానం Fri, Dec 12, 2025, 06:02 PM
హైవేపై టిప్పర్‌ను ఢీకొన్న బస్సు Fri, Dec 12, 2025, 03:54 PM
నా పైసలు నాకు ఇచ్చేయండి.. ఓడిపోయిన అభ్యర్థి ఆగ్రహం Fri, Dec 12, 2025, 03:03 PM
21 ఏళ్లకే సర్పంచ్ పదవి దక్కించుకున్న యువతి Fri, Dec 12, 2025, 02:24 PM
గెలుపొందిన సర్పంచ్ పై ప్రత్యర్థి గొడ్డలితో దాడి Fri, Dec 12, 2025, 02:16 PM
ఎమ్మెల్యే పదవి ప్రజలిచ్చింది, సేవ చేసే అవకాశం దక్కింది: పాయల్ శంకర్ Fri, Dec 12, 2025, 02:14 PM
10 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడిన హైడ్రా Fri, Dec 12, 2025, 02:12 PM
బుక్ మై షోపై హైకోర్టు సీరియస్ Fri, Dec 12, 2025, 02:06 PM
అనుమానాస్పదంగా యువకుడి మృతి Fri, Dec 12, 2025, 02:03 PM
జేఎన్టీయూలో మహిళపై ప్రొఫెసర్ లైంగిక దాడి Fri, Dec 12, 2025, 01:55 PM
మరణించినా, ప్రజల మనస్సు గెలుచుకొని ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి Fri, Dec 12, 2025, 01:51 PM
ఇడికుడ సర్పంచ్ గా పాల్వాయి రమాదేవి ఘన విజయం Fri, Dec 12, 2025, 01:50 PM
నా జోలికి వస్తే అందరి చిట్టాలు విప్పుతా Fri, Dec 12, 2025, 01:50 PM
సర్పంచిగా గెలిచిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తండ్రి Fri, Dec 12, 2025, 01:49 PM
కాంగ్రెస్ పై ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనమే సర్పంచ్ ఎన్నికల ఫలితాలు Fri, Dec 12, 2025, 01:47 PM
పంచాయతీ ఎన్నికల్లో హవా కొనసాగించిన కాంగ్రెస్ Fri, Dec 12, 2025, 01:46 PM
సర్పంచ్‌గా ఎన్నికైన బీటెక్ యువతి Fri, Dec 12, 2025, 01:45 PM
రౌడీ షీటర్ ని బహిష్కరణ చేసిన సైబరాబాద్ కమిషనరేట్ Fri, Dec 12, 2025, 01:43 PM
తెలంగాణ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వివాదానికి డైరెక్టర్ స్పందన.. విద్యార్థుల సంక్షేమం ప్రధానం Fri, Dec 12, 2025, 01:41 PM
బ్రిటన్ పార్లమెంటు కి నామినేట్ ఐన తెలంగాణ వాసి Fri, Dec 12, 2025, 01:40 PM