|
|
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 04:05 PM
ర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవం (జూన్2)రోజున ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిందని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.ఈ ఘటనలో మొత్తం 92 మంది రోగులు ఫుడ్ పాయిజన్ కారణంగానే అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో అస్వస్థతకు గురైన బాధితులను మంత్రి దామోదర ఇవాళ(బుధవారం) పరామర్శించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్యంపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారులతో మంత్రి మాట్లాడారు.ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మంత్రి దామోదర మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఆస్పత్రి డైట్ కాంట్రాక్టర్‌ను తొలగించాలని మంత్రి దామోదర ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. అస్వస్థతకు గురైన వారందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పుకొచ్చారు. డైయిట్ కారణంగానే ఈ ఫుడ్ పాయిజాన్ జరిగినట్లుగా తెలుస్తోందని అన్నారు. ఆ రోజు ఒక స్వీట్ కూడా అదనంగా రోగులకు ఇచ్చారని వివరించారు మంత్రి దామోదర రాజనర్సింహ.
అనారోగ్యం పాలైన వారిలో తీవ్రంగా ఉన్న 18 మందిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని మంత్రి దామోదర రాజనర్సింహ వివరించారు. మిగతా రోగులని గాంధీ, ఉస్మానియాతో పాటు మొత్తం ఆరు వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయని వెల్లడించారు. అనారోగ్యం పాలైన వారి ప్రాణాలకు ప్రమాదం లేదని.. వారు మరో రెండు రోజుల్లో కోలుకుంటారని వైద్యులు తెలిపారని చెప్పారు. ఇక్కడ డైట్ చూసుకునే కాంట్రాక్టర్ పనితీరు సైతం సరిగా లేదని సమాచారం అందిందని.. అతని కాంట్రాక్ట్ రద్దు చేశామని తెలిపారు మంత్రి దామోదర రాజనర్సింహ.జరిగిన ఘటనపై ఒక కమిటీని నియమించాయని తెలిపారు. కమిటీ రిపోర్టు రాగానే బాధ్యులపై చర్యలు ఉంటాయని అన్నారు. ఇప్పటికే ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని చెప్పారు. చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు.