|
|
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 11:08 AM
హెచ్‌ఎండీఏలో జోరుగా వసూళ్ల పర్వం . రూ.2 వేలు ఇస్తేనే క్షేత్రస్థాయి భూమి పర్యవేక్షణ, రూ.5 వేలు ఇస్తేనే ఎల్ఆర్ఎస్ అప్రూవల్. మున్సిపాలిటీలో లేని గ్రామపంచాయితలలో మిగిలి ఉన్న 3.44 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించడానికి దాదాపు 50 మంది జేపీపీలను ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించిన హెచ్‌ఎండీఏ . అయితే ఎల్ఆర్ఎస్ అప్రూవల్ కోసం హెచ్‌ఎండీఏ కార్యాలయానికి రాగా, జేపీపీలు క్షేత్రస్థాయి పర్యవేక్షణకు రూ.2 వేలు, ఎల్ఆర్ఎస్ అప్రూవల్ కు రూ.5 వేలు డిమాండ్ చేస్తున్నారని వాపోతున్న దరఖాస్తుదారులు. అందరూ డబ్బులు ఇచ్చి అప్రూవల్ చేయించుకుంటున్నారు, మీరు ఇవ్వకపోతే మీ దరఖాస్తు పెండింగ్ లో ఉంటుందని జేపీపీలు బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్న దరఖాస్తుదారులు . ఔట్ సోర్సింగ్ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం కారణంగానే వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తున్న హెచ్‌ఎండీఏ సిబ్బంది