|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 05:55 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. కేటీఆర్ ఆరోపణలను తిప్పికొడుతూ, ఆయనపై ఘాటైన విమర్శలు చేశారు.సచివాలయంలో మీడియాతో సీతక్క మాట్లాడుతూ, "సిస్టర్ స్ట్రోక్ దెబ్బకు కేటీఆర్‌కు చిన్న మెదడు చితికిపోయింది" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లు తీసుకున్నప్పుడు లేని భయం, ఇప్పుడు విచారణ కమిషన్ ముందుకు రావడానికి ఎందుకని కేటీఆర్‌ను ఆమె సూటిగా ప్రశ్నించారు. గోబెల్స్ తరహా ప్రచారంలో కేటీఆర్‌ను మించిన వారు లేరని, ఆయనకు "గోబెల్స్ అవార్డు" ఇవ్వాలని ఎద్దేవా చేశారు.