బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్‌పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 02:54 PM
తిరుపతి జిల్లా చెవటపాలెం గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రూ.25,000 అప్పు తీర్చలేని కారణంగా ఓ గిరిజన కుటుంబానికి చెందిన 12 ఏళ్ల బాలుడిని దారుణంగా చంపి, మృతదేహాన్ని పాతిపెట్టారు.
అనకమ్మ (32) మరియు చెంచయ్య దంపతులు ముత్తు అనే బాతుల వ్యాపారి వద్ద పనిచేస్తూ, అతడి నుండి రూ.25,000 అప్పు తీసుకున్నారు. అప్పు తిరిగి చెల్లించలేకపోవడంతో, నిందితుడు ముత్తు వారి 12 ఏళ్ల కుమారుడిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టి, నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.