ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 05:40 PM
హైదరాబాద్ శహరంపై సీఎం రేవంత్ పగపట్టారని BRS MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మండిపడ్డారు. మూసీ, హైడ్రా ప్రాజెక్టుల పేరిట ఇప్పటికే హైదరాబాద్‌లో సమస్యలు సృష్టించారని ఆయన తెలిపారు. ఇప్పుడు మెట్రో రైలు ఛార్జీలను పెంచడం ద్వారా ప్రజలపై మరింత భారం మోపుతున్నారు అని విమర్శించారు.
"ప్రతి మెట్రో ప్రయాణీకుడిపై నెలకు రూ.600 పైనే కనీస భారం పడుతుందని" అన్నారు. ఈ పెంపును తక్షణమే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌ను తిరోగమనం వైపు తీసుకెళ్లే ఏ నిర్ణయం కూడా మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు.