|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 05:24 PM
సుద్ధ వాగు సమీపంలోని శివాలయానికి వెళ్లేందుకు ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డుమార్గ సమస్యలు త్వరలోనే పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివాలయ రోడ్డుకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 65 లక్షలు మంజూరైనట్లు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ తెలిపారు.
తాజాగా శనివారం, రోడ్డుపై నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి ప్రొసిడింగ్ కాపీని కమిటీ సభ్యులకు ఆయన అందజేశారు. స్థానికులు శివాలయానికి వెళ్లేందుకు తగిన రహదారి లేక ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని కొందరు నాయకులు తన దృష్టికి తీసుకురావడంతో, తాను ఆర్ అండ్ బీ శాఖ మంత్రితో చర్చించి నిధుల్ని మంజూరు చేయించినట్లు తెలిపారు.
ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీనికి సానుకూలంగా స్పందించి రూ. 65 లక్షల నిధులను మంజూరు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే చెప్పారు. ఈ రహదారి నిర్మాణంతో భక్తులకు, స్థానిక ప్రజలకు ప్రయాణ సౌకర్యం కలుగుతుందన్నారు.