|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 12:12 PM
యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టను గురువారం రోజు ప్రపంచ సుందరీమణులు సందర్శించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు కుటుంబ సమేతంగా సుందరీమణులకు స్వాగతం పలికారు.అనంతరం ఆలయ విశిష్టతను LED స్క్రిన్ లో చూసారు.ఆలయ విశిష్టతను ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు సుందరీమణులకు తెలిపి స్వాగతం పలికినట్లు తెలిపారు.ఆ తర్వాత బ్యాటరీ వాహనాలలో మాడవీధులకు చేరుకొని అఖండ దీపానికి నెయ్యిని సమర్పించారు.అనంతరం కోలాటాలు,నృత్యాల మధ్య ఆలయంలో చేరుకున్నారు.ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం చేయగా,ఆలయ అధికారులు లడ్డు ప్రసాదాన్ని,స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.అనంతరం మాడవీధులలో శిల్పకట్టడాల వద్ద సుందరీమణులు ప్రత్యేక ఫోటోలను తీసుకున్నారు.