|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 03:27 PM
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా ప్రకటించిన నివేదిక ప్రకారం, తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల వ్యవధిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వర్ష సూచన జారీ చేశారు.
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, వనపర్తి వంటి జిల్లాలతో పాటు, సరిహద్దుల్లో ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే ఇవాళ ఉదయం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలను నివారించాలని సూచిస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఇది ఉపయుక్తంగా ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.