|
|
by Suryaa Desk | Tue, May 13, 2025, 04:49 PM
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన మెట్పల్లి మండలంలోని ఆరపేట, ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ, మల్లాపూర్ మండలంలోని సాతారం గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్శనలో కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు తీసుకొచ్చే నాణ్యమైన ధాన్యాన్ని వేగంగా, పారదర్శకంగా కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి క్వింటాల్‌కీ రైతులకు సముచితమైన ధర అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తనిఖీల్లో మెట్పల్లి ఆర్డివో శ్రీనివాస్, జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్ఓ) జితేందర్ పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వరి కొలత, తేమ శాతం, బస్తాల పంపిణీ, బారదానా లభ్యత తదితర అంశాలపై వారు సమీక్షించారు.