|
|
by Suryaa Desk | Sun, Jun 15, 2025, 09:09 AM
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం AA 22 గురించి ప్రముఖ దర్శకుడు అట్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న సత్యభామ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్న అనంతరం అట్లీ, ఆయన దర్శకత్వం వహిస్తున్న అల్లు అర్జున్ చిత్రం గురించి మాట్లాడారు.నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని ఆయన అన్నారు. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే భారీ స్థాయిలో ఈ సినిమాను రూపొందించనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, బడ్జెట్‌పై ఇంకా స్పష్టత రాలేదని ఆయన పేర్కొన్నారు.ఈ సినిమా సినీ అభిమానులు గర్వపడేలా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. చిత్ర విడుదల తేదీని నిర్మాత కళానిధి మారన్ నిర్ణయిస్తారని అట్లీ తెలిపారు.
Latest News