![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 04:00 PM
ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో మ్యాడ్ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ '8 వసంతాలు' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో అనంతిక సనీల్ కుమార్ శుద్ధి అయోధ్య అనే మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలిగా నటించింది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై భారీ బజ్ ని క్రియేట్ చేసింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క సెకండ్ సింగల్ ని పరిచయామిలా అనే టైటిల్ తో జూన్ 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి వనమాలి లిరిక్స్ అందించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సాంకేతిక సిబ్బందిలో అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైనర్‌గా, శశాంక్ మాలి ఎడిటర్‌గా మరియు బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. యాక్షన్ కొరియోగ్రఫీని వింగ్ చున్ అంజి నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. ప్రఖ్యాత పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ కంటెంట్-ఆధారిత చిత్రాన్ని నిర్మిస్తుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.
Latest News