![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 06:56 PM
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌలితో కలిసి చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా 'SSMB 29' అనే పేరు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ కోసం అంచనాలు అధికంగా ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, హైదరాబాద్‌లో కాశీ సెట్‌ను ని ఘాట్స్ మరియు దేవాలయాలతో పాటు పున సృష్టి చేసారు. మేకర్స్ ఈ సెట్ 50 కోట్లు ఖర్చు చేశారు. SSMB29 ను ప్రముఖ చిత్రనిర్మాత కెఎల్ నారాయణ 1,000 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని 2027లో, రెండో భాగాన్ని 2029లో విడుదల చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్‌కు చెందిన కెఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని నిర్మిస్తుంది. దేవా కట్ట డైలాగ్ రైటర్ గా, విజయేంద్ర ప్రసాద్ రచయితగా ఉన్నారు. ఆస్కార్ అవార్డు పొందిన స్వరకర్త MM కీరావాని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు.
Latest News