![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 10:01 AM
బాలీవుడ్ స్టార్ నటుడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ రానున్న చిత్రం 'కింగ్' లో కనిపించనున్నారు. ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రంలో నటుడు తన కుమార్తె సుహానా ఖాన్ తో స్క్రీన్ స్పేస్ ని షేర్ చేసుకుంటున్నాడు. ఈ చిత్రం సుహానా యొక్క వెండి తెర తొలి ప్రదర్శనను సూచిస్తుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క షూటింగ్ ని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ షెడ్యూల్ లో సుహానా ఖాన్ మరియు అభయ్ వెర్మ పై కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. ఈ బిగ్గీలో SRK కు జోడిగా దీపికా పదుకొనే నటిస్తుంది. అర్షద్ వార్సీ, జై డీప్, అభయ్ వెర్మ, అనిల్ కపూర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ విరోధిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పబడింది. ఈ సినిమాని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అండ్ మార్ఫ్లిక్ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు.
Latest News