|
|
by Suryaa Desk | Mon, May 19, 2025, 04:10 PM
యువ నటుడు మాస్టర్ భరత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. భరత్ తల్లి కమలాసిని హఠాన్మరణం చెందారు. ఆదివారం రాత్రి చెన్నైలో ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. కమలాసిని గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది. తల్లి అకాల మరణంతో భరత్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. భరత్‌కు మాతృ వియోగం విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయనకు ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు. బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు చెన్నైలోని భరత్ ఇంటికెళ్లి కమలాసిని భౌతిక కాయాన్ని సందర్శిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
Latest News