|
|
by Suryaa Desk | Tue, May 13, 2025, 06:27 PM
సీనియర్ ఎన్టీఆర్ మనవడు, జానకీరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. న్యూ ట్యాలెంట్ రోర్స్ బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మిస్తున్నారు. ప్రారంభోత్సవానికి నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, గారపాటి లోకేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నారా భువనేశ్వరి క్లాప్ కొట్టగా, పురందేశ్వరి కెమెరా స్విచ్చాన్ చేశారు. లోకేశ్వరి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ ‘తారక రామారావు అతని ముత్తాత నందమూరి తారక రామారావుగారి లాగా కీర్తి ప్రతిష్ఠలు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. నాలుగో తరం ఇండస్ట్రీలోకి రావడం ఆనందంగా ఉంది. రామ్ తన ప్రతిభను చాటుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఆ కసి ఉన్న వ్యక్తి కచ్చితంగా ఏం కోరుకుంటాడో ఆ స్థాయికి ఎదుగుతాడు’ అని అన్నారు. నందమూరి మోహన కృష్ణ మాట్లాడుతూ ‘రామ్‌కి సినిమా అంటే చాలా ఇష్టం. ఈ రంగంలోకి రావడానికి చాలా కృషి చేశాడు. చౌదరిగారికి రామ్ ప్రతిభ నచ్చింది. ఆయన సినిమా తీయడానికి ముందడుగు వేశారు’ అని చెప్పారు. హీరో నందమూరి తారక రామారావు మాట్లాడుతూ ‘ఈ రోజు నా కుటుంబసభ్యులందరూ నన్ను ప్రోత్సహించడానికి ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది’ అని అన్నారు.
Latest News