|
|
by Suryaa Desk | Tue, Oct 10, 2023, 08:58 AM
ఆర్. రవికుమార్ దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన కొత్త చిత్రం ‘అయలాన్’ . ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. రకుల్‌ప్రీత్ సింగ్, యోగిబాబు, కరుణాకరన్ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. 24ఏఎం స్టూడియోస్, కేజేఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. భారీ అంచనాల మధ్య సంక్రాంతికి విడుదలయ్యేందుకు ఈ చిత్రం ముస్తాబవుతోంది. ఈ చిత్ర టీజర్‌ను తాజాగా చెన్నై నగరంలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. ఈ సినిమాని దీపావళికి విడుదల చేయాలని సన్నాహాలు చేశాం. కానీ, సీజీ ఇతర గ్రాఫిక్స్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశాం. మరికొంత సమయం ఇస్తే ఇంకొన్ని కొత్త విషయాలు పొందుపరచవచ్చని చెప్పారు. ఇంతకాలం వేచిచూశాం.. మరో రెండు నెలలే కదా అని ఓకే చెప్పి అంగీకరించాం. టీజర్‌లో చూసిన ఏలియన్స్ వరల్డ్ అలా కొత్తగా సృష్టించిందే. పైగా దీపావళి రిలీజ్ తేదీ కంటే సంక్రాంతి ఎంతో అనుకూలంగా ఉందని, వరుస సెలవులు వస్తున్నాయని, అందువల్ల ఫ్యామిలీ, చిన్నారులు ఇలా ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.
Latest News