|
|
by Suryaa Desk | Tue, Oct 10, 2023, 09:00 AM
అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేశ్, దయానంద్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్ కీర్తి దర్శకుడు. దాము రెడ్డి, సింగనమల కల్యాణ్ నిర్మాతలు. ఈనెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘పురాణాల్లోని జయ, విజయుల పాత్రల్ని స్ఫూర్తిగా తీసుకొని, కలియుగంలో వారిద్దరూ జన్మిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఈ చిత్రాన్ని రూపొందించాను. ఎక్కడా ఎలాంటి వివాదాస్పద అంశాలూ లేకుండా జాగ్రత్తపడ్డాను. బడ్జెట్ పరంగా చిన్న సినిమా కావొచ్చు. కానీ కంటెంట్ పరంగా ఇది చాలా పెద్ద సినిమా’’ అన్నారు.
Latest News