|
|
by Suryaa Desk | Tue, Oct 10, 2023, 09:02 AM
రామ్ చరణ్ - శంకర్ కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. కియారా అద్వాణీ కథానాయిక. దిల్‌రాజు నిర్మాత. ఈ సినిమా నత్తనడక నడుస్తోంది. రకరకాల కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతోంది. కొంత గ్యాప్ తరవాత.. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. సోమవారం నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ మొదలెట్టారు. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. 2024 సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ.. కుదర్లేదు. 2024 వేసవిలో విడుదల చేసే అవకాశం ఉంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సూర్య, శ్రీకాంత్, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Latest News