|
|
by Suryaa Desk | Tue, Oct 10, 2023, 09:03 AM
సుధీర్ బాబు మూడు పాత్రల్లో నటించిన సినిమా 'మామా మశ్చీంద్ర' గత వారం విడుదలైంది. ఈ సినిమాకి ప్రముఖ క్యారెక్టర్ నటుడు, రచయిత హర్ష వర్ధన్ దర్శకుడు. ఇందులో ఈషా రెబ్బ, మృణాళిని రవి కథానాయికలుగా కనిపిస్తారు. సునీల్ నారంగ్, పి రామ్ మోహన్ రావు నిర్మాతలు. ఈ సినిమా మీద సుధీర్ బాబు చాలా అశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుండే క్రిటిక్స్, ప్రేక్షకులు ఒకటే తీర్పు చెప్పేసారు. ఈ సినిమా డిజాస్టర్ అని, బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది అని. కొన్ని సినిమాలు బాగోలేకపోయినా, నటీనటులు కొందరైనా బాగా చేశారు అని చెప్తారు, కానీ క్రిటిక్స్ ఈ సినిమా విషయంలో మాత్రం కథ, కథనం, నటీనటులు ఏ ఒక్కటీ ఈ సినిమాలో ఆసక్తిగా లేవు అని చెప్పేసారు. అందుకనే ఈ సినిమా విడుదలైన రెండో రోజే ఓటిటి లో స్ట్రీమింగ్ అవబోతోంది అని ప్రకటన వచ్చేసింది.
Latest News