|
|
by Suryaa Desk | Tue, Oct 10, 2023, 08:55 AM
పఠాన్, జవాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ రికార్డులు సృష్టించాడు. ప్రస్తుతం సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న ఆయనకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. చంపేస్తామంటూ ముంబైలోని ఆయన నివాసం మన్నత్‌కు పలు లేఖలు వచ్చాయి. దీంతో షారుక్‌ఖాన ముంబై పోలీసులను ఆశ్రయించారు. బెదిరింపు కాల్స్ వల్ల ఆయనకు మరింత భద్రత కల్పించాల్సిందిగా షారుక్ మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.దీంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంది. ఇప్పటి వరకూ షారుక్‌కు కల్పించిన భద్రతను మరింత పెంచింది. దాన్ని వై-ప్లస్ కేటగిరీగా మార్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు మహారాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నియమించింది. మూడు షిఫ్టుల్లో ఆయనకు భద్రత కల్పించనున్నారు.
Latest News