|
|
by Suryaa Desk | Tue, Oct 10, 2023, 08:54 AM
హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘లియో’ కు సంబంధించిన ట్రైలర్‌ను ఈ నెల 5న విడుదల చేయగా, అందులో ఓ అసభ్య పదజాలంతో కూడిన డైలాగ్ ఉంది. ఇది పెను దుమారం రేపింది. ఈ వివాదానికి పూర్తి బాధ్యత తనదేనని లియో దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్పష్టం చేశారు. ఈనెల 19న లియో విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని తాజాగా జరిగిన ఓ ప్రమోషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ డైలాగ్ వివాదం గురించి మాట్లాడుతూ.. ‘‘సినిమాలో కచ్చితంగా ఆ డైలాగ్ ఉండాలి. అమాయకుడైన ఒక వ్యక్తి తీవ్ర మనోవేదనకు గురై అలా మాట్లాడుతారు. ఆ డైలాగ్ ఏ ఒక్కరినీ నొప్పించాలన్నది ఉద్దేశం కాదు. దీనిపై చెలరేగిన వివాదానికి పూర్తి బాధ్యత నాదే. దీనికి, విజయ్ కు ఎలాంటి సంబంధం లేదు. ఈ షాట్ చిత్రీకరణ సమయంలో ఈ డైలాగ్ అవసరమా? అని విజయ్ ప్రశ్నించగా, కథ డిమాండ్ మేరకు ఉండాలని చెప్పాను అని తెలిపారు.
Latest News