|
|
by Suryaa Desk | Tue, Oct 10, 2023, 08:52 AM
రోహిత్ నందా, ఆనంది జంటగా నటించిన చిత్రం ‘విధి’. శ్రీకాంత్, శ్రీనాథ్ దర్శకులు. రంజిత్ నిర్మాత. నవంబరు 3న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో టీజర్ విడుదల చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన యువ హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘‘టీజర్ చాలా బాగుంది. కంటెంట్‌ని నమ్మి తీసిన సినిమా ఇది. ఆనంది కథల ఎంపిక బాగుంటుంది. తను సినిమా ఒప్పుకొందంటే కచ్చితంగా ఏదో విషయం ఉంటుంద’’న్నారు. ‘‘ఈ సినిమాలోని కథ, కథనాల్ని ఎవరూ ఊహించలేరు. కొత్తవారైనా అనుభవజ్ఞుల్లా నటించార’’ని నిర్మాత తెలిపారు. ‘‘ఎంత మంచి సినిమా తీశామో మేం చెప్పకూడదు. కంటెంట్ మాట్లాడాలి. మేం అనుకొన్న ఫలితం వస్తుందన్న నమ్మకం ఉంద’’ని దర్శకుడు తెలిపారు.
Latest News