|
|
by Suryaa Desk | Tue, Oct 10, 2023, 08:50 AM
ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. మాళవిక నాయర్, నిధి అగర్వాల్, నిద్ది కుమార్ హీరోయిన్లు. ‘సలార్’, ‘కల్కి’తో పాటుగా ఈ సినిమానీ సమాంతరంగా కాల్షీట్లు ఇచ్చాడు ప్రభాస్. అయితే మారుతి సినిమాకి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. కనీసం టైటిల్ కూడా చెప్పలేదు. ఎట్టకేలకు ఈ సినిమా సంగతుల్ని చిత్రబృందం అభిమానులతో పంచుకోబోతోంది. ఈనెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మారుతి సినిమా ఫస్ట్ లుక్ బయటకు రానుంది. అయితే టైటిల్ మాత్రం ఇప్పుడే ప్రకటించరని టాక్. ‘సలార్’, ‘కల్కి’ వచ్చి వెళ్లాకే.. ఈ సినిమా ప్రమోషన్లు ప్రారంభిస్తారు. టైటిల్ అప్పటి వరకూ వెల్లడించే ఛాన్స్ లేదు. మారుతి స్టైల్‌లోనే.. ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రభాస్ లుక్ స్టైలీ్‌షగా ఉంటుందని, ఆయన ‘బుజ్జిగాడు’ తరహాలో వినోదాన్ని పంచబోతున్నారని తెలుస్తోంది. 2024 చివర్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Latest News