|
|
by Suryaa Desk | Tue, Oct 10, 2023, 08:49 AM
సందీ్‌పకుమార్, దీప్తి వర్మ జంటగా నటించిన ‘ద్రోహి’ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ‘ద క్రిమినల్’ అన్నది ఉపశీర్షిక. స్వీయ దర్శకత్వంలో శ్రీకాంత్‌రెడ్టితో కలసి విజయ్ పెందుర్తి ఈ సినిమాను నిర్మించారు. అక్టోబర్ 13న నేషనల్ సినిమా డే కావడంతో ఆ రోజు మల్టీప్లెక్స్ లో రూ 112లకే సినిమా టికెట్ లభిస్తుందని నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో హీరో సందీప్ మాట్లాడుతూ ‘టైటిల్ వినగానే ఈ సినిమా ఓకే చేశా. అద్బుతమైన డ్రామా కలిగిన చిత్రం ఇది. సినిమాలో అన్ని అంశాలూ ఉన్నాయి’ అన్నారు. ఈ సినిమాలో అవకాశం రావడం, నటించడం కలగా ఉందని హీరోయిన్ డెబా డాలీ చెప్పారు. ‘చిత్ర నిర్మాణం అనగానే కష్టాలు ఉంటాయి. అవి మేమూ అనుభవించాం. ఓ పెద్ద సినిమా పాటకు, ప్రమోషన్‌కు అయ్యే ఖర్చుతో ఈ సినిమా నిర్మించాం. ప్రేక్షకుల్ని ఈ సినిమా నిరాశపరచదని మా నమ్మకం’ అన్నారు దర్శకుడు విజయ్ పెందుర్తి.
Latest News