|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 03:05 PM
బాక్సాఫీసు రికార్డులను తిరగరాసిన పుష్ప 2 సినిమా తాజాగా జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. ఈ నెల 16న ‘పుష్ప కున్రిన్’ పేరుతో జపాన్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్యాపిల్లలతో కలిసి టోక్యో పర్యటనకు వెళ్లారు. టోక్యోకు చేరుకున్నట్లు అల్లు అర్జున్ మంగళవారం ఓ ఫొటోను పంచుకున్నారు.పుష్ప2 సినిమాను జపాన్ లో గీక్ పిక్చర్స్, షోచికు సంస్థలు సంయుక్తంగా విడుదల చేయనున్నాయి. ఈ నేపథ్యంలో సదరు నిర్మాణ సంస్థల ప్రతినిధులు అల్లు అర్జున్ కు స్వాగతం పలుకుతూ, పుష్ప రిలీజ్ ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. జపనీస్ భాషలోకి సినిమాను డబ్ చేసి ఇటీవల సినిమా పోస్టర్, ట్రెయిలర్లను విడుదల చేశారు.
Latest News